వైకాపా తీర్దం పుచ్చుకొన్న దేవినేని చంద్రశేఖర్

వాస్తవం ప్రతినిధి: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ ఈ రోజు ఉదయం వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీ లో చేరారు. వైసీపీ నేత వసంత్‌ కృష్ణ ప్రసాద్ దగ్గరుండి దేవినేని చంద్రశేఖర్‌ను లోటస్‌పాండ్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీలో అవినీతి పెరిగిపోయిందని విమర్శలు గుప్పించారు. ఇరిగేషన్ ప్రాజక్టుల్లో దోపిడీ జరుగుతోందన్నారు. కేసుల నుంచి తెలుగుదేశం నేతలు తప్పించుకోలేరని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీని అధిక మెజారిటీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు. కాగా.. దేవినేని నీటి పారుదల శాఖా మంత్రిగా చంద్రబాబు కేబినెట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా దేవినేని పోటీచేస్తారని ఇప్పటికే టీడీపీ అధిష్టానం టికెట్ ఫిక్స్ చేసిన విషయం విదితమే. మైలవరం నియోజకవర్గంలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని