మరికాసేపట్లో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే మ్యాచ్‌

వాస్తవం ప్రతినిధి: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే మ్యాచ్‌ జరగనుంది. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 5 వన్డేల సిరీస్‌లో 2-1 తేడాతో భారత్‌ ఆధిక్యంలో ఉంది.