నేడు తిరిగి ఇస్లామాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నపాకిస్తాన్‌ భారత రాయబారి

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్‌లో భారత రాయబారి అజయ్‌ బిసారియా నేడు ఇక్కడినుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. పుల్వామా దాడి అనంతరం అజయ్‌ బిసారియాను సంప్రదింపుల కోసం ఢిల్లికి పిలిపించారు. పాకిస్తాన్‌లోని భారత రాయబారి అజయ్‌ బిసారియా నేడు ఇస్లామాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారని విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ చెప్పారు. శనివారంనుంచి ఆయన తిరిగి విధులకు హాజరవుతారని రవీష్‌ చెప్పారు.