లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల డౌటే..?

వాస్తవం సినిమా: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితంలో లక్ష్మీపార్వతి అడుగుపెట్టాక రాజకీయంగా కుటుంబపరంగా ఇటువంటి సంఘటనలు ప్రపంచానికి తెలియనివి వెలుగులోకి తీసుకు వస్తూ వెండితెరపై చూపించబోతున్నారు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్లు చూసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు నేతలు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినా డైరెక్టర్ ఆర్జివి ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకి ఎటువంటి అడ్డంకులు లేకుండా తనదైన శైలిలో ప్రమోషన్ కార్యక్రమాలు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పెడుతున్న కామెంట్లు చూసి చాలా మంది నెటిజన్లు నోటి మీద వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రని చాలా దారుణంగా చూపిస్తున్న క్రమంలో ఇప్పుడు సినిమా విడుదల విషయంలో చాలామంది రాజకీయ ప్రముఖులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మరియు 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యాయి. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుద‌ల కాకుండా ఆప‌డానికి కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నార‌ని, అలాగే ఒక‌పార్టీ ఈ సినిమాను బ‌య‌టకు రానీయ‌కుండా సెన్సార్ ద‌గ్గ‌రే ఆపేస్తార‌ని మాట‌లు వినిపిస్తున్నాయ‌ని, ఇది ఎన్టీఆర్ జీవితంలో వాస్త‌వంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తెర‌కెక్కుతుంద‌ని, దీంతో సెన్సార్ బోర్డు వారు ఒక్క సీన్ కూడా క‌ట్ చేయ‌కుండా, స‌ర్టిఫికేట్ ఇవ్వాల‌ని పోసాని వ్యాఖ్యానించారు.