నెల్లూరు జిల్లాలో నేడు వైసీపీ సమర శంఖారావం

వాస్తవం ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో ఇవాళ వైసీపీ సమర శంఖారావం పూరించనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సమర శంఖారావ సభలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నెల్లూరులో నాలుగో సభకు సన్నాహాలు పూర్తి చేసింది. జగన్‌ ఇప్పటికి మూడు జిల్లాల్లో సమర శంఖారావం కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 6న తిరుపతిలో, 7న తేదీన కడపలో, 11వ తేదీన అనంతపురంలో సమర శంఖారావం కార్యక్రమాలను నిర్వహించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. నాలుగో శంఖారావాన్ని ఇవాళ నెల్లూరులో నిర్వహించబోతున్నారు.