ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం దాడి చేసిన విషయం నిజమే: మసూద్‌ అజార్‌

 వాస్తవం ప్రతినిధి:  బాలాకోట్‌లోని జైష్‌-ఎ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం దాడి చేసిన విషయం నిజమేనని ఆ సంస్థ అధిపతి మసూద్‌ అజార్‌ అన్నారు. అయితే ఈ దాడిలో జైషే కేడర్‌కు కాని, తమ కుటుంబ సభ్యులకు కాని ఎలాంటి హాని కలుగలేదని మసూద్‌ చెప్పాడు. తద్వారా ఎలాంటి నష్టం జరుగలేదంటూ పాక్‌ నేతలు పేర్కొంటున్న విషయాన్నే మసూద్‌ కూడా చెప్పినట్లయింది.