జగన్‌ అప్‌కమింగ్‌ సీఎం , చంద్రబాబు ఔట్‌గోయింగ్‌ సీఎం :రోజా

వాస్తవం ప్రతినిధి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ అప్‌కమింగ్‌ సీఎం అని, చంద్రబాబు ఔట్‌గోయింగ్‌ సీఎం అని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజిక్కడ ఆమె మాట్లాడుతూ రాజధానికి జగన్‌ వ్యతిరేకమన్న వారికి చెంపపెట్టు అన్నారు. చంద్రబాబు సొంత ఇల్లు కూడా కట్టుకోలేదన్నారు. అసెంబ్లీ, సచివాలయం, సీఎం నివాసం తాత్కాలికమన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో గృహ ప్రవేశానికి ఎవ్వరినీ పిలువలేదన్నారు.