మహానాయకుడు – రివ్యూ :

రేటింగ్:2.5/5

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, ఆమని, కల్యాణ్‌రామ్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, సచిన్‌ ఖేడ్కర్‌, సుప్రియ వినోద్‌, పూనమ్‌ బజ్వా, తదితరులు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌

నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

  నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగు జనల గుండెల్లో ఎప్పటికీ ఒక చరిత్ర. అలాంటి మహనీయుడి జీవితాన్ని తెరమీద ఆవిష్కరించడం అంటే చిన్న విషయం కాదు. అంతటి గొప్ప సాహసాన్ని తలకి ఎత్తుకున్న డైరెక్టర్ రాధా కృష్ణ జాగర్లమూడి ఫస్ట్ పార్ట్ ని చాలా పేలవం గా తీసారు అనే విమర్శకుల నుంచి మాటలు వినిపించాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ని ఆయన ఏ విధంగా మలచారు అనేదాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్లాప్ వెంచర్ గా లాస్ తో సాగిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కి సీక్వెల్ గా వచ్చిన ఎన్టీఆర్ మహా నాయకుడు ఎలా ఉంది అనేది చూద్దాం రండి.

కథ –

విశ్లేషణ – పాజిటివ్ లు : మొదటి పార్ట్ లో బసవతారకం తన భర్త ఎన్టీఆర్ కథ ని చెబుతూ ఈ కథ మొదలు అవుతుంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన క్రమం లో ఆ పార్టీ సిద్ధాంతాలు ఎలా జనం లోకి వెళ్ళాయి, పార్టీ పెట్టిన తక్కువ టైం లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు. నాదెండ్ల భాస్కర రావు ఎన్టీఆర్ ని ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు – దాన్నుంచి తేరుకుని ఎన్టీఆర్ మళ్ళీ ఎలా అధికార పీఠం ఎక్కారు అనేటువంటి అంశాల సారాంశం ఈ రెండో భాగం అని చెప్పాలి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ ఎత్తుగడలు , వ్యూహాలు ఎలా సాగాయి .. ప్రజలలోకి ఎన్టీఆర్ తన ఇదెఒలొగ్య్ ని ఎలా తీసుకుని వెళ్ళ గలిగారు అనేది డైరెక్టర్ క్రిష్ బాగానే చూపించాడు. సీనియర్ ఎన్టీఆర్ గా బాలయ్య బాబు నటన అద్దిరిపోయింది. ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్ గా సూట్ అవ్వలేదు అనిపించిన బాలయ్య పొలిటికల్ లీడర్ గా అచ్చం తన తండ్రి లాగా ఒదిగిపోయాడు పాత్రలో .. 1983 ఎపిసోడ్ లని చాలా బాగా చిత్రీకరించి చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తిని రేకెత్తించింది .

నెగెటివ్ లు :

డైరెక్టర్ క్రిష్ మొదటి భాగం లో లాగానే ‘ కథ ‘ ని చెప్పడం పక్కన పెట్టి .. ఎన్టీఆర్ ‘ భజన ‘ కే మళ్ళీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ ఫేస్ తో సాగినా సెకండ్ హాఫ్ పేలవంగా తీసాడు. .. సినిమా లో ఎంచుకోవడానికి ఎన్నో ఎత్తుపల్లాల సన్నివేశాలు ఉన్నా అన్నగారు కను సైగ తో రాష్ట్రాన్ని , జనాలని శాసించగలరు అనే అంశాలు చెప్పడానికే క్రిష్ లాంటి సీనియర్ , వినూత్న దర్శకుడు ప్రాధాన్యత ఇవ్వడం అతిపెద్ద మైనస్ పాయింట్ . అవసరం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు సీన్ లు ఇరికించేసి ప్రేక్షకుల కి ‘ ఇప్పుడు ఈయన గురించి ఎందుకు ‘ అనే ఫీలింగ్ తెప్పించాడు. బసవతారకం క్యారెక్టర్ ని రెండో భాగం లో అయినా ఇంకా ఆసక్తికరంగా మలచి ఉంటె బాగుండేది. పొలిటికల్ లీడర్ గా తండ్రి పాత్రలో అద్భుతంగా చేసిన బాలయ్య ని ఒక స్టార్ హీరో గా వాడుకోలేకపోయాడు డైరెక్టర్.

మొత్తం మీద :

మొత్తం మీద చూసుకుంటే మొదటి భాగం తప్పులని డైరెక్టర్ సరిదిద్దుకోలేక పోయినా మొదటి భాగం మీద రెండో భాగం చాలా వరకూ రిలీఫ్ అని చేపచ్చు. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు ‘ అనే ఫీలింగ్ తెప్పించడం కోసం క్రిష్ పడిన కష్టం మాత్రం ప్రేక్షకులని ఇబ్బంది పెట్టింది. నాదెండ్ల ని విలన్ గా చూపిస్తూ ఎన్టీఆర్ మళ్ళీ అధికారం అందిపుచ్చుకునే వరకూ సినిమా చూపించి ఆపేయడం ఇబ్బందికర అంశం. కమర్షియల్ గా మళ్ళీ బాలయ్య కి ఈ చిత్రం కాస్త టఫ్ గానే అనిపిస్తోంది. ఫామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదాని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.

                                                                           ………….పాంచజన్య