“ఆపదలో ఉన్న పేదవారికి ఆపద్భాందవుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు” : ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: ఆపదలో ఉన్న పేదవారికి ఆపద్భాందవునిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. ఉయ్యూరు 17 వార్డులో ఇటీవల మరణించిన కుటుంబ సభ్యుల వారికి బాబూ రాజేంద్రప్రసాద్ గారు 5,000/- చంద్రన్నభీమా అందించారు.   ఉయ్యూరు 17 వార్డులో మరణించిన అబ్దుల్ షాన్ భాషా గారి భార్య నసీమా బేగం గారికి, చంద్రన్న భీమా ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం 5,000/- ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు అందించారు. ఈ సందర్భంగా MLC గారు మాట్లాడుతూ, కుటుంబ పెద్ద దిక్కు మరణించి ఇబ్బందులలో ఉన్న కుటుంబాల వారికి చంద్రన్నభీమా ద్వారా 2 నుండి 5 లక్షల రూపాయలు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజలకు ఆపద్బాంధుడిగా ఉంటున్నారని అన్నారు.

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతర శ్రామికుడిగా పని చేస్తున్న చంద్రబాబు గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ షేక్ ఖలీల్, అజ్మతుల్లా బాబు, రాజులపాటి ఫణి, చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, జంపన శ్రీనివాసరావు, మరీదు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.