పశ్చిమలో “ఈ స్థానాల” కి… అభ్యర్ధులు ఖరారు..???

వాస్తవం ప్రతినిధి: ఏపీ రాజకీయాల్లో తక్కువ సమయంలో ప్రధాన పార్టీలతో సమానంగా పేరు తెచ్చుకుని, రాజకీయాలని తన చుట్టూ తిప్పుకుంటున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్నాయి. పవన్ స్క్రీనింగ్ టెస్ట్ ల పేరుతో సమయం గడిపేస్తున్నాడు. ఇదంతా ఓ నాటకం , కాలయాపన చేసి చివర్లో ఎదో ఒక పార్టీకి మద్దతు తెలుపుతాడు అనే వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలు ఆనోటా ఈనోటా పార్టీలోని ముఖ్య నేతలని, కార్యకర్తలని కలవర పెట్టడంతో.ఆలోచనలో పడ్డ పవన్ అభ్యర్ధుల ప్రకటన విషయంలో ఓ క్లారిటీ కి వచ్చాడని తెలుస్తోంది. పశ్చిమ నుంచీ పోటీ చేసేవారి మొదటి లిస్ట్ ని త్వరలో ప్రకటించి అలాంటి వారి నోళ్ళు మూయించే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది…ఈ క్రమంలోనే పశ్చిమలో ఖరాలు చేసిన కొంతమంది అభ్యర్దుల పేర్లు ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే టీడీపీ , వైసీపీలో తమ తమ అభ్యర్ధుల విషయంలో ఓ క్లారిటీ కి వచ్చేశాయి. అన్ని జిల్లాలలో కొంతమంది పేర్లు ప్రకటించారు కూడా. అయితే జనసేన అధినేత ఇప్పటి వరకూ ఎవరి పేర్లు ప్రకటించక పోవడంతో సొంత పార్టీలో సైతం గుబులు కలుగుతోందట.ఈ పరిస్థితులు అన్నీ గమనించిన పవన్ త్వరలో కొన్ని నియోజకవర్గాలలో తాను ఎంపిక చేసిన అభ్యర్డులని ప్రకటించడానికి సిద్దం అయ్యారు…పరిస్థితి చెయ్యి దాటక ముందే కొంత మంది అభ్యర్ధులని ప్రకటిస్తే కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్టు ఉంటుందని భావిస్తున్నారట.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పవన్ ప్రకటించబోయే అభ్యర్ధుల మొదటి జాబితాని ఒక సారి పరిశీలిస్తే. ఇప్పటికే పవన్ ముమ్మిడివరం నుంచీ మల్లుల లక్ష్మీనారాయణ ని మొట్టమొదటి సారిగా పార్టీ తొలి అభ్యర్ధిగా ప్రకటించారు. ఇక తెనాలి నుంచీ నాదెండ్ల మనోహర్ , గుంటూరు నుంచీ తోట చంద్రశేఖర్ పేర్లు కూడా ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా మరి కొన్ని పేర్లు ప్రస్తావన కూడా పార్టీలో జరుగుతోంది వారిలో ఏలూరు నుంచీ పీ.సాగర్ బాబు , చింతలపూడి నుంచీ ఈశ్వరయ్య , ఆచంట నుంచీ మల్లుల లక్ష్మీనారాయణ, తాడేపల్లిగూడెం నుంచీ యర్రా నవీన్ , పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి.త్వరలోనే ఈ అభ్యర్ధుల విషయంలో పవన్ తుది నిర్ణయం ప్రకటించనున్నారని కూడా తెలుస్తోంది. పశ్చిమలో దాదాపు 15 నియోజకవర్గాలు ఉండగా పవన్ కళ్యాణ్ దాదాపు 8 మంది అభ్యర్ధులని ఇప్పటికే ఖరారు చేశారని త్వరలోనే అందరి పేర్లని ప్రకటిస్తారని తెలుస్తోంది.