శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

వాస్తవం ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో వైసీపీ కార్యాలయానికి వెళ్లి టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఘటనను నిరసిస్తూ కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌ వద్ద వైసీపీ కార్యకర్తలు ఆం దోళన నిర్వహించారు. వివరాలు తెలియాల్సి ఉంది.