జ్యోతి హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

వాస్తవం ప్రతినిధి: గుంటూరు జిల్లాలో కలకలం రేపిన జ్యోతి హత్యకేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ విజయరావు మీడియాకు వెల్లడించారు. కాగా.. జ్యోతి మృతదేహానికి రీపోస్ట్‌మార్టం చేస్తున్నారు. బంధువుల అనుమానం మేరకు రీపోస్ట్‌మార్టం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాడేపల్లి శ్మశానవాటికలో జ్యోతి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీయిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో రీపోస్ట్‌మార్టం చేస్తున్నారు