కెన్యాలో కూలిన విమానం ..ఐదుగురు వ్యక్తులు మృతి

వాస్తవం ప్రతినిధి: కెన్యాలో ఒక చిన్న విమానం కూలిపోయి, విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. వారిలో ముగ్గురు అమెరికన్‌ జాతీయులు. దక్షిణ కెన్యాలో లోండియానిలోని కామ్‌వింగ్‌ ప్రాంతంలో సెస్నా విమానం కూలిపోయిందని కెరిచో కౌంటీ కమాండర్‌ జేమ్స్‌ ముగేరా చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే వరకూ మృతుల పేర్లను వెల్లడించబోమని ఆయన చెప్పారు. దని కెరిచో కౌంటీ కమాండర్‌ జేమ్స్‌ ముగేరా చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించే వరకూ మృతుల పేర్లను వెల్లడించబోమని ఆయన చెప్పారు.