తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి భూమిపూజ

వాస్తవం ప్రతినిధి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు గ్రామంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన దాదాపు 15 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ‘ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి, పరిశోధక కేంద్రం’కు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సభాపతి కోడెల శివప్రసాదరావు, ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు నోరి, మంత్రులు నారా లోకేశ్‌, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, ఫరూక్‌, ఎంపీ కొనకళ్ల రాయణ తదితరులు పాల్గొన్నారు.