భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబునే మళ్లీ సీఎం చేయాలి : టీడీపీ నియోజకవర్గ నాయకులు ఏనుగ కిషోర్

వాస్తవం ప్రతినిధి: భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు ఏనుగ కిషోర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు సందర్శన నిమిత్తం మంగళగిరి మండలం లోని ఆత్మకూరు గ్రామ రైతులు, మహిళల కోసం ఏనుగ కిషోర్ తన సొంత నిధులు రూ.70,000/-లతో మూడు బస్సులను ఏర్పాటు చేసి 150 మంది గ్రామస్తులను పోలవరానికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కిషోర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల పాలిట అపర భగీరథుడని కొనియాడారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తూ గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు సాగు త్రాగునీరు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాడెల్టాకు సాగు, త్రాగునీరు అందించడంతోపాటు భవిష్యత్తులో రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా సీఎం చంద్రబాబు ఎంతగానో పాటు పడుతున్నారని,ఇక రాజధాని అభివృద్ధి కొరకు ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. కావున రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబును మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమ్మా నాగేశ్వరరావు, టిడిపి నాయకులు కె చిరంజీవి, మోతుకూరి రవికుమార్, గద్దె చంద్రయ్య, పోలిమట్ల ప్రేమ్ కుమార్, తాటి వెంకటరావు, జొన్నకూటి శ్రీను, పూటు సుబ్బయ్య, ఎం సాంబశివరావు, పి వెంకటనారాయణ, ఎం సుబ్బారావు, కొల్లి నాగేంద్ర బాలాజీ, గోవాడ రవిలతో పాటు పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.