అప్పట్లో రాజీనామా చేస్తానని మోదీకి చెప్పా.. కానీ ఆయన వారించారు!: దేవెగౌడ

వాస్తవం ప్రతినిధి: ఎంపి పదవికి తాను రాజీనామా చేద్దామనుకున్నాను కానీ ప్రధాని మోడీ తనను కొనసాగాలని కోరారని జెడిఎస్‌ నేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ చెప్పారు. లోక్‌సభ ముగింపు రోజున దేవెగౌడ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బిజెపికి 276 సీట్ల కంటే ఎక్కువ వస్తే తాను ఎంపి పదవికి రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. బిజెపికి 282 సీట్లు వచ్చాయి. అప్పుడు తాను రాజీనామా చేస్తున్నట్లు మోడీకి చెప్పానని ఆయన అన్నారు. అయితే దానిని సీరియస్‌గా తీసుకోవద్దని, మీరు ఎంతో సీనియర్‌, మీరు రాజీనామా చేయవద్దని మోడీ తనతో అన్నారని దేవెగౌడ గుర్తు చేసుకున్నారు.