నేడు పశ్చిమగోదావరి జిల్లా లో పర్యటించనున్న పవన్

వాస్తవం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని పెనుగొండలో నూతనంగా నిర్మితమైన శ్రీ వాసవి మాత ఆలయాన్ని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జనసేన వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి . ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడల్లలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వాగతం చెబుతూ పోస్టర్లు వెలిశాయి.