టీడీపీకి అవంతి గుడ్ బై..?

వాస్తవం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. లేటెస్ట్‌గా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ టీడీపీను వీడతారని ప్రచారం జరుగుతోంది. అవంతి శ్రీనివాస్‌ టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అవంతి శ్రీనివాస్‌ భీమిలి లేదా విశాఖ నార్త్ అసెంబ్లి స్థానం కోరుతున్నట్లు సమాచారం. అసెంబ్లి టికెట్‌పై హామీ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం నిరాకరించింది. దీంతో అవంతి శ్రీనివాస్‌ తెలుగుదేశం పార్టీ నేతలకు అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. అవంతి శ్రీనివాస్‌కు భీమిలి టికెట్‌ ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించినట్లు సమాచారం. దీంతో అవంతి శ్రీనివాస్‌ వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. అవంతి శ్రీనివాస్‌ను ఈరోజు వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు అవంతి శ్రీనివాస్‌ నివాసానికి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు అవంతి శ్రీనివాస్‌ వైసీపీ అధినేత జగన్‌తో భేటీకానున్నట్లు సమాచారం.