మోదీని ప్ర‌శంశ‌ల‌తో ముంచెత్తిన ములాయం .. షాక్ లో సోనియా

వాస్తవం ప్రతినిధి: పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది.భాజాపాకు వ్య‌తిరేకకూట‌మిలో ఎస్‌పీ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే లోక్‌స‌భ‌లో మోదీపై ములాయం చేసిన అస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మోదీని ప్ర‌శంశ‌ల‌తో ముంచెత్తారు. లోక్ స‌భ సాక్షిగా మ‌రో సారి మోదీ ప్ర‌ధాని కావాల‌ని యులాయం ఆకాంక్షించారు. మోదీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగిడారు. ఆయన వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఆశ్చర్యానికి గుర‌య్యారు. అధికార పార్టీ ఎంపీలు మాత్రం సంతోషంలో మునిగిపోయారు. మోదీని ములాయం పొగుడుతున్నప్పుడు సభలో నవ్వులు వెల్లివిరియడంతో పాటు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేసారు. అయితే యులాయం ప‌క్క‌నే కూర్చున్న సోనియా గాంధీ మాత్రం షాక్ అయ్యారు.

మోడీ ఎన్నో చట్టబద్ధమైన పనులు చేశారు. వాటిని ఎవరూ వేలెత్తి చూపించలేరు. మీ కుర్చీలో కూర్చొని ఇంత బాగా నిర్వహించడం మామూలు విషయం కాదు. ఈ పార్లమెంట్ లో ప్రతి మంత్రిని సంతోషపరచాలి. ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టడం చాలా కష్టమైన విషయం. ఆయన మాట్లాడింది చూస్తే పార్లమెంటును మీరు చాలా బాగా నిర్వహించారని మాత్రం చెబుతాను. ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ పొగ‌డ్త‌లు కురిపించారు.