పాఠశాలలో భారీ పేలుడు

వాస్తవం ప్రతినిధి: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోనిని ఓ పాఠశాలలో భారీ పేలుడు సంభవించింది. తరగతి గదిలోనే జరిగిన ఈ పేలుడులో 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిని భద్రతా దళాలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. ‘తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులను ప్రత్యేక వైద్య సదుపాయాల కోసం శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. . ఇప్పటికీ పాఠశాల ప్రాంగణంలో ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం.  .స్కూలులో పేలుడుకు కారణాలు కానీ, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనేది కానీ తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు .