ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ..కీలక నిర్ణయాలు

వాస్తవం ప్రతినిధి: అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిపారు. కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకం విధివిధానాలపై చర్చించారు. ప్రతి రైతు కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఫిబ్రవరి చివరి వారంలో చెక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునేలా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించారు.

కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే:
రైతు రుణమాఫీ చెక్కులు త్వరితగతిన చెల్లించాలి.
ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 175 చదరపు గజాల ఇంటి స్థలం.
చదరపు గజం రూ. 4వేల చొప్పున 230 ఎకరాలు కేటాయింపు.
జర్నలిస్టులకు ఎకరం రూ. 10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయింపు.
తొలి విడత సీఆర్డీఏకు రూ. కోటి చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయింపు. మిగిలిన మొత్తాన్ని రెండేళ్లలో చెల్లించే వెసులుబాటు.
డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు. సిమ్ కార్డుతో పాటు మూడేళ్లపాటు కనెక్టివిటీ ఇచ్చేలా పంపిణీ.