దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ  ఢిల్లిలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆప్‌ ఆధ్వర్యంలో ర్యాలీ

వాస్తవం ప్రతినిధి: దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆధ్వర్యంలో ర్యాలీ జరుగనున్నది. ఢిల్లిలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగే ఈ ర్యాలీలో ప్రతిపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ, డిఎంకె, ఆర్జేడీ, ఆర్‌ఎల్‌డి తదితర పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.