జ‌న‌సేన పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ‌ ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో అందుకు అన్నివిధాలుగా సిద్ధమవుతోంది జనసేన పార్టీ… కాసేపటి క్రితం జ‌న‌సేన పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ‌ను ప్రారంభమైంది. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన పార్టీ త‌రఫున బ‌రిలో నిలవాలనే ఆశావ‌హుల బ‌యోడేటాలను పరిశీలిస్తున్నారు. నిన్న సాయంత్రం జనసేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తొలి దరఖాస్తుతో లాంఛ‌నంగా ఈ ప్రక్రియ ప్రారంభించగా… ఇవాళ విజ‌య‌వాడలోని జనసేన ప్రధాన కార్యాల‌యంలో ఐదుగురు స‌భ్యుల స్క్రీనింగ్ క‌మిటీ బయో డేటాల పరిశీలన ప్రారంభించింది. మాదాసు గంగాధరం ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది.