టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆమంచి ..జగన్మోహన్‌రెడ్డితో భేటీ

వాస్తవం ప్రతినిధి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఉదయం ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పంపారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు .ఈ నేపధ్యంలో
కొద్దిసేపటి క్రితం ఆమంచి కృష్ణమోహన్‌ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమంచి జగన్‌తో సమావేశమయ్యారు. పార్టీలో చేరే విషయంపై జగన్‌తో చర్చిస్తున్నారు.a