మధ్యంతర బడ్జెట్‌లో పేదలకు, మధ్యతరగతి వారికి పలు రాయితీలు- ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌

వాస్తవం ప్రతినిధి: మధ్యంతర బడ్జెట్‌లో పేదలకు, మధ్యతరగతి వారికి ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ పలు రాయితీల వర్షం కురిపించారు. ఏడాదికి రూ. 9.5 లక్షల ఆదాయం సంపాదించే వారికి కూడా పన్ను నుంచి తప్పించకోవడానికి ఆర్థికమంత్రి గోయల్‌ మంగళవారం లోకసభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పలు చిట్కాలు సూచించారు. అయితే పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. పన్ను రేటులో రిబేటు ఇస్తే ప్రజలు పెద్దమొత్తంలో వ్యయం చేస్తే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ఆర్థికబిల్లును లోకసభ మూజు వాణి వోటుతో ఆమోదం తెలిపింది. రాయితీల గురించి ప్రస్తా విస్తూ.. ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం వారికి ఇంతకు ముందు రూ.2వేల లబ్ధి నుంచి ప్రస్తుతం రూ.12,500కు పెం చామని, రూ.5 లక్షల ఆదాయం వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదన్నారు. అలాగే స్టాండర్డ్‌ డిడెక్షన్‌ను రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచినట్లు దీంతో పాటు కొత్త గృహాలుకొనుగోలు చేసేవారికి అదనంగా లబ్ధి చేకూర్చామన్నారు.

రూ.9.5 లక్షల ఆదాయం వారికి పన్ను రాయితీల గురించి ప్రస్తావిస్తూ.. అధికారుల గణాంకాల ప్రకారం .. ఏడాదికి రూ.9 లక్షల నుంచి రూ.9.5 లక్షల ఆదాయం సంపాదించే వారు ఆదాయంపన్ను చెల్లించకుండా తప్పించుకోవచ్చునని దీనికి ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని టాక్స్‌ సేవింగ్స్‌ స్కీంలో పెట్టుబడులు పెట్టవచ్చునని గోయల్‌ సూచించారు. దీంతో పన్ను చెల్లింపుదారుడికి డబ్బు ఆదా అవుతుంది.. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ గత నాలుగున్నర ఏళ్ల నుంచి సమాజంలోని ప్రతి వర్గానికి ఏదో రకంగా లబ్ధి చేకూర్చిందని గోయల్‌ అన్నారు. దీంతో గత నాలుగు సంవత్సరాల నుంచి పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగింది. అలాగే పన్న వసూళ్లు పెరిగాయి. పన్ను వసూళ్లు పెరిగితే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్దెత్తున వ్యయం చేయగలుగుతుందన్నారు. బ్యాంకు ఎఫ్‌డీఐపై వచ్చే వడ్డీ ఆదాయంపై రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంచడంతో సీనియర్‌ సిటిజన్స్‌ లబ్ధి చేకూరుతుందన్నారు. గృహారుణాలపై ఇచ్చే వడ్డీరేటుపై రాయితీ ఇవ్వడం వల్ల హౌసింగ్‌ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి గృహం ఉండాలనేది ప్రభుత్వం లక్ష్యంమని దేశం 75వ స్వాతంత్రదినోత్సవ సంబరాలు జరుపుకొనే నాటికి ప్రతి ఒక్కరికి గృహం ఉండాలనేది మోడీ ప్రభుత్వం ఆకాంక్షని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పలు విధానాల వల్ల స్థిరాస్తి ధరలు అదుపులో ఉన్నాయని, గృహాలపై తీసుకొన్న రుణాలు తిరిగి చెల్లించడం వల్ల బ్యాంకుల్లో మొండి బకాయిలు కూడా తగ్గముఖం పడుతున్నాయన్నారు. స్వతాహాగా తీను చార్టర్డ్‌ అకౌంటెంట్‌నని ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమి తం చేయడానికి కొన్ని సర్దుబాట్లు చేయాల్సి వచ్చిందన్నారు. వాస్తవంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలనుకున్ని వీలుకాలేదని 3.4 శాతానికి ఎగబాకే అవకాశాలున్నాయన్నారు.