ఆరేళ్ల బాలికను హతమార్చి రక్తం తాగిన మేనత్త

వాస్తవం ప్రతినిధి:   విశాఖ – మన్యంలో  దారుణం చోటు చేసుకుంది.పెద బయలు మండలం లకేయుపుట్టులో ఆరేళ్ల బాలిక కొర్ర అనితను మేనత్త దారుణంగా హతమార్చింది. చిన్నారిని నరికి చంపి రక్తాన్ని కూడా తాగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. వివరాల ప్రకారం..

విశాఖ .. మన్యం ప్రాంతంలోని ‘పెదబయలు’ మండలం పరిథిలోని ‘లకేయుపుట్టు’లో నివసిస్తోన్న ఓ దంపతుల ఇంటికి, లక్ష్మీపేట పంచాయతీ .. ‘కప్పాడు’ గ్రామం నుంచి రస్మో అనే యువతి వచ్చింది. ఈ యువతికి ఆ దంపతులు తమ్ముడు – మరదలు వరస అవుతారు. నెల రోజులుగా రస్మో అక్కడే వుండి పోవడంతో, భారంగా భావించిన మరదలు ..ఇక తిరిగి బయలుదేరమని చెప్పింది.

దాంతో కోపంతో రగిలిపోయిన రస్మో .. కట్టెలకోసమని చెప్పి తమ్ముడి కూతురును వెంటబెట్టుకుని వెళ్లి కత్తితో కడతేర్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి వెళ్లగా.. అప్పటికే బాలిక మృతి చెందింది. దీంతో నిందితురాలిని గ్రామస్థులు పట్టుకొని చెట్టుకు కట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.