యాత్ర’ సినిమా ఏమాత్రం డ్యామేజ్ అయినా జగన్ కి ఎఫెక్ట్ అయ్యేది అంటున్న డైరెక్టర్..!

వాస్తవం సినిమా: వైయస్ చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా తాజాగా విడుదలైన భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలో ఈ సినిమా తీసిన డైరెక్టర్ మ‌హి వి. రాఘ‌వ సినిమా హిట్ అవ్వడంతో ఎంతగానో సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం యాత్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్ల సృష్టిస్తూ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి చాలా మంది రాజకీయ నేతలు మరియు వైఎస్ హయాంలో లబ్ది పొందిన ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వైయస్ పాత్రలో నటించిన మమ్ముట్టి అద్భుతంగా నటించారని..వెండితెరపై మమ్ముట్టి కనబడలేదని రాజశేఖర్ రెడ్డిని మాత్రమే చూశామని చాలామంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. అయితే యాత్ర సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో మీడియాతో ఆయన సంతోషాన్ని పంచుకున్నారు డైరెక్టర్ మ‌హి వి. రాఘ‌వ. ఈ సందర్భంగా మ‌హి వి. రాఘ‌వ మాట్లాడుతూ…సినిమాలో ఎవ‌రు కూడా మ‌మ్మూట్టిని చూడ‌లేద‌ని,అంద‌రికి ఆయ‌న‌లో వైఎస్‌గారే క‌నిపించారని తెలిపారు. నాపై నమ్మకం ఉంచి, గుడ్డిగా నమ్మి రాజశేఖరరెడ్డి గారి జీవిత చరిత్రను చెప్పిన వైఎస్ జగన్ అన్నకు, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటాను. యాత్ర సినిమా ఫ‌లితం వేరేలా ఉంటే క‌నుక అది ఖ‌చ్చితంగా జ‌గ‌న్ గారి రాజ‌కీయ కెరియర్ కి ఎఫెక్ట్ అయ్యే ఉండేదని.. రాబోయే ఎన్నికల మీద ఆ ప్రభావం క‌నిపించేద‌ని చెప్పుకొచ్చారు. అయిన నమ్మి నాకు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించిన వైఎస్ ఫ్యామిలీకి కృత‌జ్ఞత‌లు తెలిపారు డైరెక్టర్ మ‌హి వి. రాఘ‌వ.