వెండితెరపై దూసుకెళ్ళిపోతున్న యాంకర్ అనసూయ..!

వాస్తవం సినిమా: బుల్లితెరపై యాంకరింగ్ లో తనకంటూ క్రేజ్ ఏర్పరచుకొని ఇటీవల అడపాదడపా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్న యాంకర్ అనసూయ మెల్ల మెల్లగా పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ తన రేంజ్ పెంచుకుంటుంది. ఇటీవల అనసూయ చేసిన ఆమె పాత్రలు ఆమెకు వరుస అవకాశాలు కలిగిస్తూఇండస్ట్రీలో బిజీ యాక్టర్ అయ్యేలా చేశాయి. ఈ క్రమంలో ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక అవకాశాల కోసం ఎదురుచూసిన అనసూయ ఇప్పుడు తన వద్దకి అవకాశాలు వచ్చేలా చేసుకుంది తన నటనతో. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున పక్కన స్పెషల్ సాంగ్ స్టెప్పులు వేసి అలరించిన అనసూయ తర్వాత క్షణం సినిమా లో అద్భుతంగా నటించి తనలో ఉన్న నటనను వెండితెరపై చూపించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కొల్లగొట్టింది. ముఖ్యంగా రంగస్థలం సినిమా లో రంగమ్మ పాత్రలో అనసూయ అద్భుతంగా నటించింది. ఇదిలా ఉండగా ఆ స్థాయిలో పాత్రలు మాత్రం తర్వాత రాబట్టలేకపోయింది అనసూయ. ఈ మధ్య అనసూయ చేసిన ఎఫ్2 సినిమాలో క్యారెక్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్. యాత్రలో కూడా ఆమెది చిన్న పాత్రే. యాత్రలో తన పాత్రకు మంచి అప్లాజ్ వచ్చిందంటూ అనసూయ సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. అనసూయకు ఎక్కువ ఆఫర్లు రాకపోవటానికి కారణం ఆమె గ్లామర్ ప్రధాన పత్రాలు చేయటానికి మొగ్గు చూపకపోవటమే అని తెలుస్తుంది.