మరోసారి అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న ప్రభాస్..!

వాస్తవం సినిమా: తన స్నేహితుడు సుజిత్ దర్శకత్వంలో బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అదే స్థాయిలో హిట్ కొట్టాలని ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. గత కొన్ని సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి చాలా వరకు వార్తలు ఏమీ కూడా బయటకు రాలేదు అయితే గత ఏడాది అక్టోబర్ మాసంలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్నపాటి వీడియో ఒకటి విడుదల చేసి ప్రభాస్ అభిమానులను అలరించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఎక్కడా కూడా రాజీ పడకుండా డైరెక్టర్ సుజీత్ సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా “షేడ్స్ ఆఫ్ సాహో” అనే ఒక మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ నుంచి ఆ వీడియోకి కొనసాగింపుగా “షేడ్స్ ఆఫ్ సాహో” 2 మేకింగ్ వీడియోని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.ఈ వీడియోని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. మొత్తం మీద మరోసారి సర్ప్రైజ్ అవ్వడానికి ప్రభాస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.