బోయపాటిపై “మెగా”… టార్గెట్

వాస్తవం సినిమా: సంక్రాంతికి టాలీవుడ్ ప్రేక్షకులకి, మెగా అభిమానులకి “మెగా ఫ్యామిలీ” వినయ విధేయ రామ సినిమాని కానుకగా ఇవ్వాలని అనుకుంది. అనుకున్నట్టుగానే సినిమాని భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసినా బోయపాటి అపరాధాల వలన సినిమా భారీ ఫ్లాప్ ని అందుకుంది. రంగస్థలం తరువాత ఆచి తూచి అడుగులు వేయాలని అనుకున్న చరణ్ కి ఈ సినిమా తీరని నిరాశని మిగిల్చింది. మెగా అభిమానులకి బోయపాటి పై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించింది..ఈ పరిణామాలతో ఒక్క సారిగా బోయపాటి , మెగా అభిమానులకి టార్గెట్ అయ్యాడు.

ఇదిలాఉంటే ఎన్టీఆర్ కధానాయకుడు కంటే కూడా ఈ సినిమా రికవరిలో 70శాతం చేరుకుంది. అంతేకాదు గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాత వాసి కూడా కేలవం 50శాతం కంటే తక్కువ రికవరీ చేసిందని. కానీ.. వీటన్నింటిలో కంటే ఎంతో ఎక్కువగానే రికవరీ శాతం వినయ విధేయ రామ చేసిందని అంటున్నారు. అయినా సరే బోయపాటి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగడం లేదు. బోయపాటి ని మెగా అభిమానులు ఉతికి ఆరేస్తున్నారు.

యాక్షన్ సినిమాలు చేయడంలో దిట్టగా పేరొందిన బోయపాటి ..చరణ్ విషయంలో ఎందుకు ఇలా చేశాడు అనే కోణంలో ఆలోచిస్తున్న వారికి బోయపాటి పై తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కేవలం చరణ్ సినిమా విషయంలో బోయపాటి ఎందుకు ఇలా చేశాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. చరణ్ సైతం ప్రెస్ నోట్ లో అందరికీ కతజ్ఞతలు చెప్పి బోయపాటి పేరు మాత్రం ప్రస్తావించక పోవడంతో పాటు నిర్మాత సైతం బోయపాటి ని పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది.

ఇక దాంతో మెగా అభిమానులకి బోయపాటి మరింత టార్గెట్ అయ్యాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ వచ్చిన తరువాత కూడా అభిమానులు బోయపాటిని టార్గెట్ చేయలేదు. కాని ఎప్పుడయితే చరణ్ , నిర్మాతలు బోయపాటి ని టార్గెట్ చేశారో అప్పటినుంచీ అభిమానులు కూడా బోయపాటిని టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.