రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రథసప్తమి వేడుకలు

వాస్తవం ప్రతినిధి : రథసప్తమి పర్వదినాన్ని నేడు ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభంమయ్యాయి. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఆంగరంగ వైభవంగా జరుగ్తున్నాయి . ఈ వేడుకలలో భాగంగా శ్రీవారి సుర్యప్రభ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. ఉదయం 5.30 గంటలకే మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మాడ వీధులలో ఊరేగుతు భక్తులకు దర్శనమిచ్చారు. తేజోవిరాజితుడైన శ్రీనివాసుడు బంగారు సూర్యప్రభవాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి వారికి సుప్రభాత సమయం లో ప్రత్యేక పూజలు నిరహించారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరారు.