పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి : ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ యలమంచిలి వేంకట బాబూ రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.

ఉయ్యూరులో స్టార్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ను ఎమ్మెల్సీ యలమంచిలి వేంకట బాబూ రాజేంద్రప్రసాద్ గారు, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గార్లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేయడంతో, చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని అందులో భాగంగానే ఉయ్యూరు ప్రాంతానికి కార్పొరేట్ సంస్థలు తరలి వస్తున్నాయని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.

పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా కల్పించే ఎన్టీఆర్ వైద్య సేవలు నాణ్యమైన రీతిలో అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు కోరారు.

ఈ కార్యక్రమంలో యాజమాన్యంతో పాటు ఉయ్యూరు నగర చైర్మన్ అబ్దుల్ ఖుద్దూస్, ఆంఛ్ చైర్మన్ అబూ కలాం, మాజీ చైర్మన్ పూర్ణచంద్రరావు, కౌన్సిలర్స్, తెదేపా నాయకులు నడిమింటీ. పైడయ్య, తదితరులు పాల్గొన్నారు.