రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసిన చంద్రబాబు, 11 మంది బృందం

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని 11 మంది బృందం కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. మొత్తం 18 డిమాండ్లతో కూడిన లేఖను ఆయనకు చంద్రబాబు అందజేశారు. ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చంద్రబాబు తదితరులు పాదయాత్రగా వెళ్లారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోవింద్ ను కోరామని చెప్పారు. విభజన హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో మోదీ చెప్పిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రధాని మోదీకి నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మోదీకి లేదని అన్నారు. ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తానికి తెలియజేశామని చెప్పారు.