ఈడి ఎదుట హాజరైన రాబర్ట్‌ వాద్రా, ఆయన తల్లి మౌరీన్‌ వాద్రా

 వాస్తవం ప్రతినిధి: బికనీర్‌ కుంభకోణానికి సంబంధించి ఇవాళ ఈడి ఎదుట రాబర్ట్‌ వాద్రా, ఆయన తల్లి మౌరీన్‌ వాద్రా ఐపూర్లో విచారణకు హాజరయ్యారు. రాజస్థాన్‌ సరిహద్దు పట్టణం బికనీర్‌లో భూకుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై వాద్రా, ఆయన తల్లిని ఈడి విచారిస్తుంది.లండన్‌ ఆస్తుల కేసులో ఇప్పటికే ఆయన ఢిల్లీలో మూడు సార్లు ఈడి ముందు హాజరైనారు. కాగా జైపూర్‌లోని ఈడి జోనల్‌ కార్యాలయానికి ఈ ఇద్దరితో పాటు వాద్రా భార్య, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా తోడుగా వచ్చారు. వాద్రా ఈడి ముందుకు రావడం ఇది నాలుగోసారి కాగా, జైపూర్‌లో విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి.