పార్లమెంటు సెంట్రల్ హాలులో అటల్ బిహారీ వాజ్‌పేయి భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు సెంట్రల్ హాలులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భారీ చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానినరేంద్ర మోదీ, ఉప్ర రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోకసభ స్పీకర్ సుమిత్రామహాజన్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. వాజ్‌పేయీ సేవలను, నాయకత్వ లక్షణాలను గుర్తుచేసుకున్నారు.  అటల్‌జీ అధిక కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారని, కాని ఆయన తన ఐడియాలజీ నుంచి తప్పుకోలేదని అన్నారు. ప్రసంగంలో పవర్, మౌనంలో శక్తి ఉండేదని అన్నారు. ఆయన జీవితం ఎంతోమందికి స్పూర్తి దాయకమని అన్నారు.  ఇప్పటి నుంచి అటల్‌జీ మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు స్ఫూర్తినిస్తారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారు. అయినప్పటికీ పదవిని ఆశించకుండా ప్రజల సమస్యలను లేవనెత్తేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తన సిద్దాంతాలను వదలని గొప్ప వ్యక్తి అటల్‌జీ. ఆయన ప్రసంగంలో తెలియని ఓ శక్తి ఉంటుంది. ఆయనో గొప్ప నేత’ అని మోదీ కొనియాడారు. మనో వైజ్ఞానికి శాస్త్రవేత్తలు ఆయన ఉపన్యాసాలను, వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.  మౌనంలో కూడా ఆయన విశాలమైన సందేశాన్ని ఇచ్చేవారని అన్నారు