ఫిబ్రవరి 13 తరువాత టీడీపీకి భారీ షాక్..???

వాస్తవం ప్రతినిధి: రాజకీయాల్లో ఎప్పుడు సీన్ రివర్స్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ పరిస్థితి ప్రతీ పార్టీలో ఉంటూనే ఉంటుంది. కొంతమంది తమకి టిక్కట్టు రాలేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్తే మరికొందరు. మాకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయి అంటూ ఎదో ఒక కారణం చెప్తూ తప్పించుకు తిరుగుతూ ఉంటారు.అయితే ఇలాంటి కారణాల వలన సదరు వ్యక్తులు పార్టీని విడిచి వెళ్ళితే పెద్దగా ప్రభావం ఉండదు కాని మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోంది అంటూ ఎవరన్నా ఇద్దరు నేతలు మాత్రం బయటకి వస్తే మాత్రం ఆ పరిస్థితులు ఎంతో దారుణంగా ఉంటాయి.

.అయితే ఇప్పుడు ఇదే పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదుర్కొనున్నారని తెలుస్తోంది. తమ వర్గానికి అన్యాయం జరుగుతోంది అంటూ ఇద్దరు కీలక నేతలు టీడీపీ కి ఘలక్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. తెలుగు దేశంలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు కొందరు రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది…ఆ వివరాలలోకి వెళ్తే..

కొన్ని రోజుల క్రితం చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీ వీడుతున్నారు అంటూ తెగ రూమర్లు వచ్చాయి. అయితే ఆయన తరువాత బాబు తో భేటీ అయ్యారు. ఆ తరువాత ఆమంచి ఒక్క సారిగా గోదావరి జిల్లా రామచంద్రపురం లోని తోట త్రిమూర్తులు ఇంట్లో ప్రత్యక్షం కావడంతో అందరిని ఆశ్చర్యంలోకి నెట్టింది. దాంతో టీడీపీలో కాపునేతలు రెండు గ్రూపులుగా ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ గ్రూపులోని వాళ్ళు త్వరలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది, ఈ మేరకు ఓ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట.

ఫిబ్రవరి 13న తోట త్రిమూర్తులు కుమారుడు వివాహానికి కాపు ఎమ్మెల్యేలు అందరూ హాజరు కానున్నారు. అదేరోజున ముద్రగడ సైతం ఆ పెళ్ళికి రానున్నారని తెలుస్తోంది. ఈ తరుణంలో వారు సుదీర్ఘ చర్చలు జరుపుతారని. పెళ్లి తరువాత అందరూ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా టీడీపీలో కొనసాగాలా లేక వైసీపీకి వెంట నడవాలా…?? అదే కాక తమ సామాజిక వర్గానికి సంభందించిన జనసేన పార్టీలోకి వెళ్ళాలా అనే నిర్ణయం తీసుకోనున్నారట.

అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత లేకపోయినా సరే ఒక వేళ తోట త్రిమూర్తులు గనుకా పార్టీని వీడాల్సి వస్తే మాత్రం వైసీపీకి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. కాని ఒక్క సారిగా రాజకీయాలని మలుపు తిప్పాలన్నా , లేక వేడెక్కించాలన్నా సరే జనసేనానికే చెల్లుతుంది కాబట్టి ఊహించని విధంగా తోట తిరిమూర్తులు జనసేనలోకి వెళ్ళినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు…మరి ఫిబ్రవరి 13 ఎలాంటి ముగింపు ఇస్తుందో వేచి చూడాల్సిందే.