వాస్తవం సినిమా: బాహుబలి విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ తాను చేయబోయే సినిమాల విషయంలో షరతులు విధిస్తూ అందరికి షాక్ ఇస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినపడుతున్న టాక్.ముఖ్యంగా బాహుబలి వంటి విజయంతో ప్రపంచ స్థాయిలో తనకంటూ మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ అదే మార్కెట్ తన కెరీర్లో కొనసాగించాలని చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేయాలంటే ఎవరైనా సరే కనీసం రెండు వందల కోట్ల బడ్జెట్ ఉండాలి అంటూ షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాకు మొదట 200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కాని ఇప్పుడు ఈ బడ్జెట్ మరో 50 కోట్లు పెరిగినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణతో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీలో నటించనున్నాడు ప్రభాస్. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో పాతకాలం సెట్లు, నిర్మాణ ఖర్చు 250 కోట్లు దాటుంతుందని సమాచారం. ఈ రెండు ఈ సినిమాలు కనుక హిట్ అయితే ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో ప్రభాస్ తో సినిమా చేయాలంటే కచ్చితంగా 200 కోట్ల బడ్జెట్ వుంటేనే అన్నట్టు గా మారిపోయింది.