మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించబోతున్న బన్నీ..?

వాస్తవం సినిమా: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గతంలో సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాక ముందు చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక చిన్న రోల్ లో నటించి అద్భుతమైన డ్యాన్స్ కనబరిచారు. అయితే ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లకముందు నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక పాటలో చిరంజీవితో స్టెప్పులు వేసి అలరించిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర పోరాట యోధుడిగా చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి లో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. అయితే ఈ విషయం మాత్రం ఇంకా అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. కానీ అల్లు అర్జున్ తో ఇప్పటికే చిత్ర బృందం సంప్రదింపులు జరిపారంట. చిరుతో నటించే ఛాన్స్ వస్తే అల్లు అర్జున్ ఒప్పుకోకుండా ఉంటాడా చెప్పండి… ఎగిరి గంతేసి మరీ షూటింగ్ కి హాజరవుతారు. ఇప్పటికే ఈ సినిమా పై మెగా అభిమానులకు భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క సైరా సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద నటీనటులు లేటెస్ట్ ఉన్నా. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటంతో, ఈ చిత్రానికి అంచనాలు బాగానే పెరిగిపోతున్నాయి.