యాత్రలో ఆ సీన్లు ఎప్పటికీ మర్చిపోలేను అంటున్న రావు రమేష్..!

వాస్తవం సినిమా: ఇటీవల వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్ర గురించి తీసిన యాత్ర సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన చాలా మంది తెలుగువారు సినిమా హాలు నుండి కంటతడి పెట్టుకుని బయటకు వస్తున్నారు. ముఖ్యంగా వైయస్ హయాంలో లబ్ధిపొందిన యువత ఇటువంటి నాయకుడిని పోగొట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయింది అంటూ సినిమా హాలు బయటకు వచ్చి రాజశేఖర్ రెడ్డి వల్ల తమ జీవితం ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ స్థితిలో ఉందో తెలియజేస్తూ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా కులాలకతీతంగా రాజశేఖర్ రెడ్డిని ప్రతి ఒక్కరు ప్రేమిస్తారని చాలామంది ఈ సినిమాను చూసిన రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రాజశేఖర్ రెడ్డి ఆత్మగా కేవీపీ పాత్రలో నటించిన రావు రమేష్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన పాత్రపై స్పందించిన రావు రమేష్..ఇది డబ్బుల కోసం తీసిన సినిమా కాదని గుండెను టచ్ చేసే సినిమా. రాజకీయ సినిమాలు తీసే సమయంలో ఏదో ఒక చోట ఎవరో ఒకరిపై చెడుగా ఉంటుంది. కాని యాత్రలో మాత్రం అలా కాకుండా దర్శకుడు చక్కగా చూపించాడు. ఇలాంటి సినిమాలో నటించినందుకు గౌరవంగా గర్వంగా ఉంది. అద్భుతంగా వైయస్ పాదయాత్రను దర్శకుడు చిత్రీకరించాడని ప్రజల భావోద్వేగాలను వెండితెరపై చూస్తుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయని అంతటి దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటు అంటూ అలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ అద్భుతమైన నాయకుడు అనిపించాలని కితాబిచ్చారు రావు రమేష్.