ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ తేదీ ఖరారు చేయడానికి కంగారు పడుతున్న సినిమా యూనిట్..!

వాస్తవం సినిమా: స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కథ ఆధారంగా తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ సారథ్యంలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం మనకందరికీ తెలిసినదే. ఇందులో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ సినిమా జీవితం గురించి తీయగా ఈ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ప్రేక్షకుల అభిమానులను నోచుకోలేకపోయింది. షో పడిన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ రావడంతో సినిమా తీవ్ర డిజాస్టర్ పాలయ్యింది. దీంతో మొదటి పార్ట్ ఇచ్చిన దెబ్బకి ఎన్టీఆర్ రాజకీయ రంగం గురించి రావలసిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని ప్రస్తుతం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో కొన్ని సీన్లు విషయంలో రీ షూట్ లో జరుపుకుంటుంది. మరోపక్క సినిమా విడుదల విషయంలో వస్తున్న పుకార్లను పట్టించుకోకుండా క్రిష్ చకా చకా షూటింగ్ కానిచ్చేశారు, శనివారం నాటికి గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. మర్చి 1న విడుదల కానుంది అని ఇటీవల వార్తలొచ్చాయి, అయితే ఈ నెల 22న మహానాయకుడు విడుదల కానుందని విద్యాబాలన్ చేత అనౌన్స్ చేయించింది సినిమా యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అనుకున్న సమయానికి కచ్చితంగా విడుదలవుతుందని సినిమా యూనిట్ అంటోంది. అయితే ఇంకో పక్క మాత్రం ఏపీలో ఎలక్షన్ మూమెంట్ నేపథ్యంలో సినిమా తిరగబడ కూడదని కచ్చితంగా హిట్టు కొట్టాలని సినిమా యూనిట్ రిలీజ్ చేయడంలో కొంత ఆలోచనలు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి వినబడుతున్న టాక్.