తన కూతురు పెళ్లి ఎప్పుడో తెలియజేసిన నాగబాబు..!

వాస్తవం సినిమా: ఇటీవల సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ పై మరియు వైసీపీ పార్టీ అధినేత జగన్ పై మరియు టిడిపి నేతలపై వైరల్ వీడియో లు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన కూతురు నిహారిక పెళ్లి గురించి సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో గతంలో మంత్రి నారా లోకేష్ ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి చానల్ మరియు జగన్ చంద్రబాబు ల గురించి చేసిన వ్యాఖ్యలలో ఎక్కువగా నాగ బాబు ని బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి మరియు కుటుంబం గురించి ముఖ్యంగా తన కూతురు నిహారిక పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త‌న‌కు పెళ్లి విష‌యంలో నిహారిక‌కు టైమ్ ఇచ్చామ‌ని, కులంతో సంబంధం లేకుండా మంచి అబ్బాయి అయితే చాల‌ని పెళ్లి చేయ‌డానికి సిధ్ధింగా ఉన్నామ‌ని నాగ‌బాబు అన్నారు. నిహారిక‌కు న‌టించ‌డం అంటే ఇష్ట‌మ‌ని, ఇంట్లోవాళ్ళంతా క‌లిసి చ‌ర్చింకున్న‌ప్పుడు నిహారికి న‌టిస్తాన‌ని గ‌ట్టిగా చెప్పింద‌ని.. అందుకే త‌న కోరిక తీర్చడానికి, న‌టించేందుకు ఒప్పుకున్నామ‌ని నాగ‌బాబు అన్నారు. ప్రస్తుతం ఆమె తన కెరియర్ కోసం వెబ్ సిరీస్ చేస్తుందని పేర్కొంటూ తనకు ఇష్టమైతే తమ కాపు కులం నుండి అయినా గాని లేదా ఇతర కులాల్లో ఉన్న మంచి అబ్బాయిలు దొరికితే పెళ్లి చేయడం ఖాయమని పేర్కొన్నారు నాగబాబు .