కేఏపాల్ కు మాతృవియోగం

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ తల్లి కిలారి సంతోషమ్మ మృతిచెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పలు మార్లు కేఏపాల్ మీడియా వేదికగా వెల్లడించారు కూడా. తాజాగా కేఏ పాల్ తల్లి కిలారి సంతోషమ్మ గత రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె రాత్రి మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కేఏ పాల్ స్వయంగా తెలియజేశారు. ప్రభువుతో ఆమె కలిసిపోయిందని చెప్పారు. తనకు సొంత ఇల్లు, సొంత కారు, కనీసం ఒక్క రూపాయి డబ్బు లేకపోయినా, పేదల బాగు కోసం ఆమె నిత్యమూ ప్రార్థించేవారని అన్నారు. తన తల్లిగారే..తనను ప్రజాశాంతి పార్టీ పెట్టి ఎన్నికల్లో బరిలో నిలవాలని దీవించారని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.