శివాజీ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్న జనసైనికులు..!!!

వాస్తవం ప్రతినిధి: టాలీవుడ్ లో సినిమా అవకాశాలు కోల్పోయి దాదాపు ఎన్నో ఏళ్ళు అయిన తరుణంలో, ఎటువంటి అవకాశాలు దొరకక పోవడం, సరిగ్గా అదే సమయంలో ఏపీ విభజన జరగడం, శివాజీ కి బాగా కలిసొచ్చిన అంశాలు అనే చెప్పాలి. సినిమా కోసం వేసే రంగు తుడిచేసుకుని, ఈ సారి శివాజీ పొలిటికల్ ఎంట్రీ చేయడానికి పొలిటికల్ రంగు వేసుకుని ప్రత్యెక హోదా పేరుతో కృష్ణా నదిలో దిగి నిరసన తెలిపాడు. ఇదంతా నిన్న జరిగిన శివాజీ గరుడ నిరసన గురించి కాదు.  కొత్తలో ఇలానే శివాజీ నిరసన తెలిపాడు. అంతేనా ఒకడుగు ముందుకు వేసి..

ఇప్పుడు చంకనెత్తుకుని మద్దతు తెలుపుతున్న టీడీపీ అధినేత బాబు పై అప్పుడు విమర్శలు సంధించాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ముందుగానే ఉద్యమాలు శివాజీ టీడీపీపైనా విమర్శలు గుప్పించారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం బీజేపీ తో పాటు టీడీపీ నే అంటూ నిరసన తెలిపాడు. అంతేకాదు టీడీపీ వైఖరికి నిరసనగా ఏకంగా విజయవాడ కేంద్రంగా నిరాహార దీక్ష కూడా చేపట్టిన శివాజీ ని ఇదే టీడీపీ ప్రభుత్వం పోలీసులతో రెక్కలు పట్టించి ఆసుపత్రిలో వేయించింది..సీన్ కట్ చేస్తే..

మళ్ళీ కృష్ణా నదిలో గరుడ ప్లాన్ తో దిగిన శివాజీ ఈ సారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యెక హోదా గురించి మాట్లాడుతూ మోడీ పాచి పోయిన లడ్డూలు ఇచ్చారు అని విమర్శలు చేశారు బాగానే ఉంది. అలాంటి మోడీ ఏపీ వస్తే ఎక్కడికి పారిపోయారు, దాక్కున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో చిర్రెత్తుకొచ్చిన జనసేన కార్యకర్తలు శివాజీని సోషల్ మీడియాలో ఎకేస్తున్నారు.

గతంలో ఇదే హోదా కోసం బాబు పై నిరసన తెలుపుతూ కృష్ణ లో మునిగావ్, అప్పుడు బాబు వైఖరికి ఇప్పటి బాబు వైఖరికి తేడా ఏంటో నువ్వే చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు. హోదా అవసరం లేదని బాబు వ్యాఖ్యలు చేశారు , సంజీవనా అంటూ వెటకారం చేశారు అప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావ్ శివాజీ అంటూ దుమ్ము దులిపారు. అప్పుడు బాబు ని వ్యతిరేకించి ఇప్పుడు ఢిల్లీ దీక్షకి మద్దతు తెలపమని అంటున్నావ్. ఎక్కడి నుంచీ ఎమ్మెల్యే గా టిక్కెట్టు ఇస్తానని బాబు మాట ఇచ్చారో చెప్తావా అంటూ ఫైర్ అయ్యారు జనసేన కార్యకర్తలు.

వాస్తవానికి హోదా విషయంలో టీడీపీ ,వైసీపీ తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్న సమయంలో హోదా విషయాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ముందు నుంచీ పోరాటం చేస్తోంది జనసేనే అన్న విషయం శివాజీ మర్చిపోయి, బాబు ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు కాబట్టే ఈ రకమైన ఊసరవెల్లి పలుకులు పలుకుతున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.