ప్రధానిగా ఉండటానికి మోడీ అనర్హుడు: జేసీ

వాస్తవం ప్రతినిధి: ప్రధానిగా ఉండటానికి మోడీ అనర్హుడని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ధర్మపోరాట దీక్ష వద్ద విలేకరులతో మాట్లాడారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్కాచారం చెప్పడం లేదని అనడం అంటే అంతకంటే అసమర్ధత మరొకటి ఉండదని ఆయన పేర్కొన్నారు. జేసీ దివాకరరెడ్డి ప్రధాని మోడీ అసమర్ధుడని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎవరు ప్రధాని అయినా సరే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని అన్నారు.