చంద్రబాబు మరో కీలక నిర్ణయం..గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్లు

వాస్తవం ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా గిరిజనులకు శుభవార్త చెప్పింది.సామాజిక భద్రత కింద గిరిజనులకు ఇచ్చే వృద్దాప్య పింఛన్ ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు కుదించింది. ఇకపై 50 ఏళ్లకే వారికి పింఛన్ అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం అదికారిక ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలంటూ ప్రభుత్వం ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్త్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ద్వారా సుమారు లక్షమంది గిరిజనులు లబ్ది పొందే అవకాశముందని అధికారులు తెలిపారు.