ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు :రోజా

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, పథకాల పేరు చెప్పి చంద్రబాబునాయుడు ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. ఈ ఉదయం తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె, నిన్నటివరకూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు, నేడు కాంగ్రెస్ తో కలిసి తిరుగుతున్నారని, రేపు మరో పార్టీతో కలుస్తారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఓట్ల కొనుగోలు ప్రక్రియ బహిరంగంగా సాగుతోందని, ఈసీ దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేసిన రోజా, పెన్షన్ల పెంపు పేరిట వృద్ధులకు, ‘పసుపు – కుంకుమ’ అంటూ మహిళలను చంద్రబాబు మధ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. డబ్బులు పంచుతూ టీడీపీకి ఓటు వేయాలని ఆయన మనుషులు అడుగుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆమె అభిప్రాయపడ్డారు.