సీబీఐ విచారణకు హాజరైన కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్

వాస్తవం ప్రతినిధి: శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎట్టకేలకు హాజరయ్యారు. షిల్లాంగ్ లోని సీబీఐ కార్యాలయానికి ఆయన వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. తొలుత సీబీఐ కార్యాలయంలో రాజీవ్ కుమార్ ను విచారించిన అనంతరం, ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆయన్ని ప్రశ్నించినత్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసు విచారణకు రాజీవ్ కుమార్ సహకరించాలని, సీబీఐ అధికారుల విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణకు రాజీవ్ కుమార్ హాజరయ్యారు.