లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో సంచలన కామెంట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ..!

వాస్తవం సినిమా: స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ రెండు భాగాలుగా మొదటిది సినిమా జీవితం గురించి మరొకటి రాజకీయ జీవితం గురించి తీస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి అసలు సిసలైన కథ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాపై అటు సినిమా ఇండస్ట్రీలో…మరియు రాజకీయ రంగంలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ జీవితంలో అసలుసిసలైన నిజాలు చూపిస్తానని ఛాలెంజ్ చేసి వర్మ తీస్తున్న ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను ఈ నెల 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఉదయం 9:27 నిమిషాలకు విడుదల చేస్తాను అని స్పష్టం చేసారు. దీనికి ఆయన ఒక ఆసక్తికర ట్యాగ్ కూడా పెట్టుకున్నారు.మాములుగా అన్ని సినిమాలకు మాది కుటుంబ కథా చిత్రం అని చెప్పుకుంటారు కానీ ఇక్కడ వర్మ మాత్రం అందుకు భిన్నంగా ఇది “కుటుంబ కుట్రల చిత్రం” అని అంటున్నారు.ఈ ట్రైలర్ ద్వారా ఎన్టీఆర్ గారిని అప్పుడు ఎవరు ఎలా కుట్రపూరితంగా మోసం చేసారు,విధేయత లేని అభిమానులు,కుటుంబీకులు ఎలా అన్నగారి పతనానికి కారణమయ్యారో తెలియాలంటే ఈ ట్రైలర్ కోసం ఎదురు చూడాలని వర్మ ఒక సంచలన ట్వీట్ పెట్టారు.