మహేష్ బాబు అభిమానులను కలవర పెట్టే వార్త..!

వాస్తవం సినిమా: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా ‘మహర్షి’. తన కెరియర్ లో 25వ సినిమా కనుక మహేష్ బాబు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మంచి ఊపు మీద ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిన్నపాటి వీడియో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది ఆగస్టు మాసంలో విడుదలైన సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో త్వరలో వచ్చే వేసవిలో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ప్రతీ కొత్త సినిమాను అమెజాన్ ప్రైమ్ లో అతి కొద్ది రోజుల్లోనే స్ట్రీమ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఇలాంటిదే ఒక వార్త మహర్షి విషయంలో బయటకు వచ్చింది.మహర్షి సినిమా విడుదలైన నెల రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుందని సమాచారం.ఇది మాత్రం మహేష్ అభిమానులకు కాస్త కలవరపెట్టే వార్తనే చెప్పాలి.ఇప్పటికే నిర్మాణ సంస్థతో అమెజాన్ ప్రైమ్ వారితో ఒప్పందం కూడా కుదిర్చేసుకున్నారని తెలుస్తుంది.మరి ఈ వార్త విన్న మహేష్ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరోపక్క మహేష్ బాబు తన చివరి సినిమా భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అదే స్థాయిలో ఈ సినిమా కూడా హిట్ కొట్టాలని ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.