భారతీయుడు పార్ట్ 2 సినిమా గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కమల్..!

వాస్తవం సినిమా: శంకర్ దర్శకత్వంలో గతంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు సినిమా భారతీయ చలన చిత్ర రంగంలోనే అనేక రికార్డులు మరియు సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా ఆ సమయంలో విడుదలైన ఈ సినిమా దక్షిణాది సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ సంగతి అందరికీ తెలిసినదే. సౌత్ ఇండస్ట్రీ లో ఉంది భాషల్లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇదిలా ఉండగా చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా రెండో భాగాన్ని కొనసాగిస్తున్నారు డైరెక్టర్ శంకర్. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు బయటకు వచ్చాయి. అయితే బయటకు వచ్చిన పోస్టర్లలో కమల్ లుక్ అనుకున్నట్టుగా రాలేదనే అసంతృప్తితో శంకర్ ఉన్నట్టు,ఆ కారణంగానే ఆయన షూటింగును ఆపేశాడనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది.

అయితే ఆ విషయంపై తాజాగా కమల్ స్పందించారు. “భారతీయుడు 2” షూటింగు ఆగిపోయిందనే వార్తలు అవాస్తవం అని అన్నారు. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో తాను చేస్తోన్న వృద్ధుడి క్యారెక్టర్ కి సంబంధించిన మేకప్ చక్కగా సెట్ అయ్యిందని, ఈ విషయంలో శంకర్ పూర్తి క్లారిటీతో వున్నాడని చెప్పుకొచ్చారు. అవుట్ పుట్ అనుకున్నట్టుగా వస్తోందని క్లారిటీ ఇచ్చారు